Home » TG EAPCET 2025 APPLICATION – ఎఫ్‌సెట్ దరఖాస్తు ప్రారంభం

TG EAPCET 2025 APPLICATION – ఎఫ్‌సెట్ దరఖాస్తు ప్రారంభం

BIKKIS NEWS (FEB. 25) : TG EAPCET 2025 APPLICATION. తెలంగాణ రాష్ట్ర ఎఫ్‌సెట్ 2025 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభం కానుంది. సాయంత్రం 4.45 గంటల నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

TG EAPCET 2025 APPLICATION LINK

ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా, వెటర్నరీ, హర్టీకల్చర్, ఫారెస్ట్రీ, ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సుల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కొరకు TG EAPCET 2025 ప్రవేశ పరీక్ష ను నిర్వహించనున్నారు.

ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో ఆన్లైన్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

దరఖాస్తు గడువు:

ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 25 నుంచి ఎప్రిల్ 04 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.

250/- ఆలస్య రుసుముతో : ఎప్రిల్ – 09

500/- ఆలస్య రుసుముతో : ఎప్రిల్ – 14

2500/- ఆలస్య రుసుముతో : ఎప్రిల్ – 18

5000/- ఆలస్య రుసుముతో : ఎప్రిల్ – 24 వరకు గడువు కలదు

దరఖాస్తు ఫీజు : 900/- రూపాయలు, SC, ST, PH అభ్యర్థులకు 500/- రూపాయలు గా నిర్ణయించారు.

ఇంజనీరింగ్ & అగ్రికల్చర్ విభాగాల్లో పరీక్ష రాసే అభ్యర్థులకు ఫీజు 1,800/- రూపాయలు, SC, ST, PH అభ్యర్థులకు 1,000/- రూపాయలు గా నిర్ణయించారు.

అర్హతలు : ఇంటర్మీడియట్ లో 45% (రిజర్వ్‌డ్ కేటగిరీ వారికి 40%) మార్కులు ఉండాలి.

పరీక్ష తేదీలు :

అగ్రికల్చర్ & ఫార్మా విభాగానికి చెందిన పరీక్షలు ఎప్రిల్ 29, 30 వ తేదీలలో, ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు మే 2 – 6 వరకు నిర్వహించనున్నారు.

ఉదయం సెషన్ 9.00 – 12.00 వరకు… మధ్యాహ్నం సెషన్ 3.00 – 6.00 గంటల వరకు నిర్వహిస్తారు.

పూర్తి నోటిఫికేషన్ : Pdf

వెబ్సైట్ & దరఖాస్తు లింక్ :

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు