BIKKIS NEWS (FEB. 26) : ICMR NIN 25 HEALTH TIPS. భారత వైద్య పరిశోధన మండలి మరియు జాతీయ పౌష్టిక ఆహార సంస్థ సంపూర్ణ ఆరోగ్యం మరియు నూరేళ్ల ఆయుష్ కొరకు 25 ఆరోగ్య సూత్రాలను తాజాగా విడుదల చేశారు.
25 సూత్రాలను పాటిస్తూ మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, నిండు జీవితాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. ఆ సూచనలను చూద్దాం…
ICMR NIN 25 HEALTH TIPS
1) వివిధ పోషకాలు ఉండే వివిధ ఆహారాలను మన ఆహారంగా తీసుకోవాలి.
2) రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి
3) కాఫీ, టీలలో ఉండే కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి
4) ఏ సీజన్ లో లభించే పండ్లను ఆ సీజన్ లో తప్పనిసరిగా తినాలి.
5) ఆహారంలో ఉప్పును మరింతగా తగ్గించి, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలను తప్పనిసరిగా వాడండి.
6) అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వు ఉండే లీన్ (లేత) మాంసాన్ని తినండి.
7) ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
8) చక్కెర వినియోగాన్ని మరింతగా తగ్గించండి
9) వివిధ రకాల నూనెలను వాడటం, వాటిని మితంగా వాడటం అలవాటు చేసుకోవాలి.
10) ఆహార పదార్థాల ప్యాకెట్ల పై ఉన్న లేబుల్ లను సరిగ్గా చదివి వాటిలో ఉన్న పోషకాల గురించి చదివిన తర్వాతనే వాటిని ఆహారంగా తీసుకోండి
11) పండ్ల రసాలను తీసుకోవడం బదులు, తాజా పండ్లను నేరుగా తీసుకోవడం చాలా మంచిది.
12) ఇంటి ఆహారాన్ని అలవాటు చేసుకోండి. బయట ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం మేలు.
13) పాలిష్ చేసిన ధాన్యాల బదులు ముడి ధాన్యాలు వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం
14) ఇల్లు, ఆఫీసులలో మెట్లు ఎక్కి వెళ్లడానికి ప్రయత్నించండి. లిప్ట్ ఎక్కడాన్ని తగ్గించండి.
15) ఆహారాన్ని వేగంగా తినకుండా, రుచిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినండి.
16) జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు పులియబెట్టిన ఆహారాన్ని అలవాటు చేసుకోండి.
17) రోజు సూర్యకాంతిలో ఉండండి. తద్వారా విటమిన్ డి లభించి, పలు సమస్యలు పరిష్కారం అవుతాయి.
18) వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రతను పాటించండి తద్వారా అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోండి.
19) స్క్రీన్ టైం (మొబైల్, టీవీ, సిస్టం) చూసే సమయాన్ని తగ్గించండి. కుటుంబంతో గడపండి.
20) రోజు వ్యాయామం చేయండి. తద్వారా ఆరోగ్యంగా ఉండండి.
21) ఒకే చోట గంటలపాటు కూర్చోవద్దు, మద్యమద్యలో అటు ఇటు నడుస్తూ ఉండండి.
22) ఎవరికైనా కానుకలుగా ఇచ్చేటప్పుడు మిఠాయిలు కాకుండా తాజా పండ్లను ఇవ్వండి.
23) భోజన షెడ్యూల్ రోజు ఒకేలా ఉండేలా చూడండి.
24) రోజూ ద్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందండి.
25) కల్తీ ఆహరంకు దూరంగా ఉండండి.
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు