Home » TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 01 – 02 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 01 – 02 – 2025

BIKKIS NEWS (ఫిబ్రవరి 01) : TODAY NEWS IN TELUGU on 1st FEBRUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 1st FEBRUARY 2025

TELANGANA NEWS

రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో ఏడు శాతం నిధులను కేటాయించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.

ఈ రోజు నేను గంభీరంగా ఉన్నా. మౌనంగా చూస్తున్నా..త్వరలోనే వస్తా’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఆఖరుదాకా అంతే సంగతా.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలెప్పుడో వారంలో చెప్పండి: సుప్రీంకోర్టు

హైదరాబాద్‌లో ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

గ్రూప్‌-1పై మళ్లీ సుప్రీంకు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన అభ్యర్థులు

7 లోపు వర్గీకరణ చేయకుంటే హైదరాబాద్‌లో సునామీ సృష్టిస్తాం.. సీఎం రేవంత్‌ రెడ్డికి మందకృష్ణ మాదిగ హెచ్చరిక.

ANDHRA PRADESH NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని లోకేష్ వెల్లడించారు.

రథసప్తమి రోజున తిరుమలలో పలు సేవలు రద్దు : టీటీడీ చైర్మన్‌

సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టేవారిపై చర్యలు : ఏపీ కొత్త డీజీపీ

పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం కృషి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

NATIONAL NEWS

పేదలు, మధ్య తరగతి ప్రజలను లక్ష్మిదేవి కరుణించాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు.

భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు

ఐఎస్‌ఎస్‌కు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్‌గా ఎంపికైనట్టు ‘నాసా’ ప్రకటించింది.

ఆప్‌కు 8 మంది ఎమ్మెల్యేల రాజీనామా

పోలింగ్‌ వీడియోలను భద్రపరచాలి.. ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం

‘పేలవంగా ఉంది’.. రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ వ్యాఖ్యలు

INTERNATIONAL NEWS

అత్యధిక సమయం స్పేస్‌వాకింగ్‌ చేసిన తొలి మహిళా వ్యోమగామిగా భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ రికార్డ్‌ సృష్టించారు. ఆమె 62 గంటల 6 నిమిషాలపాటు స్పేస్‌వాక్‌ చేశారు.

అమెరికా పౌరసత్వం కోసం ప్రపంచమంతా ఎగబడితే ఎలా? – ట్రంప్

2024 వైఆర్‌4 అనే భారీ గ్రహ శకలం(ఆస్టరాయిడ్‌) 2032లో భూమిని ఢీ కొట్టవచ్చని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

సెన్సెక్స్ : (740.76)
నిఫ్టీ : 23,508.40 (258.90)

పార్లమెంట్‌ ముందుకు ఆర్థిక సర్వే.. ఉభయసభల్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

నేడు పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ 2025 – 26 ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌

ఒకేరోజు రూ.1,100 పెరిగిన పదిగ్రాముల ధర. 84,900గా నమోదైంది.

SPORTS NEWS

భారత క్రికెట్‌ అభిమానుల ఆరాధ్య దైవం సచిన్‌ టెండూల్కర్‌ ను. బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనుంది.

మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్‌ చేరింది. సెమీస్ లో ఇంగ్లండ్ ను ఓడించారు.

ఫిబ్రవరి 2 న భారత్ – సౌతాఫ్రికా మధ్య మహిళల అండర్‌-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్

నాలుగో టీట్వంటీ లో ఇంగ్లండ్ పై విజయం సిరీస్ 3 – 1 తేడాతో గెలుపు.

EDUCATION & JOBS UPDATES

నేడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీషు ప్రాక్టికల్ పరీక్ష.

UGC NET పేపర్ లీక్ ఆధారాలు లేవు – సీబీఐ

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు