Home » TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 01 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23 – 01 – 2025

BIKKIS NEWS (జనవరి 23) : TODAY NEWS IN TELUGU on 23rd JANUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 23rd JANUARY 2025

TELANGANA NEWS

అర్హులందరికీ రేషన్‌కార్డులను అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ, ఏపీ హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలు

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రాంతంలో పండే పసుపునకు జీఐ ట్యాగ్‌(భౌగోళిక గుర్తింపు) రానున్నది.

రాష్ట్రంలో ఉద్యోగులకు హెల్త్‌ స్కీంను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వీ లచ్చిరెడ్డి డిమాండ్‌ చేశారు

దావోస్ లో 56,300 కోట్ల ఒప్పందాలు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

జీహెచ్ ఎంసీ విస్తరణ కు కమిటీ

అమెరికా వెళ్ళే పర్యాటకులలో భారత్ కు రెండో స్థానం.

ANDHRA PRADESH NEWS

తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ

దావోస్ లో బిల్‌గేట్స్ తో భేటి అయినా చంద్రబాబు

ఏపీ నూతన డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పంచాయతీ కి ఒక కార్యదర్శి ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం.

NATIONAL NEWS

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించింది. వీరు రేప్ కేసులో దోషులు.

మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా భోపాల్‌లో ఉన్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన పూర్వీకుల ఆస్తులు కేంద్ర ప్రభుత్వం హస్తగతం కానున్నాయి.

ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో దోషి సంజయ్‌ రాయ్‌కి మరణ శిక్ష విధించాలని సీబీఐ కోరింది

దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ తెలిపారు.

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష (సీఎస్‌ఈ) 2025కు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో ఐదేండ్ల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది

జనపనార మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.315 పెంచి, రూ.5,650 ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది.

దేశంలో ఓటర్లు 99.1 కోట్లు చేరినట్లు ఈసీ ప్రకటన.

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 8 మంది దుర్మరణం.

మణిపూర్‌ లో బీజేపీ నేతృత్వంలోని బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నితీష్ కుమార్.

INTERNATIONAL NEWS

చైనా దిగుమ‌తుల‌పై 10 శాతం ప‌న్ను విధించ‌నున్న అమెరికా

అమెరికా లో జన్మతః పౌరసత్వం రద్దుపై న్యాయపోరు

BUSINESS NEWS

సెన్సెక్స్ 567, నిఫ్టీ 131 పాయింట్ల లాభాలతో ముగిశాయి.

24 క్యారెట్‌ 10 గ్రాములు రూ.82,730 పలికింది. ఒక్కరోజే రూ.630 పెరిగి ఆల్ టైమ్ గరిష్ట ధరను తాకింది.

SPORTS NEWS

ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం.

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సెమీస్ లో జకోవిచ్ – జ్వెరెవ్ మరియు సిన్నర్ – షెల్టన్ మద్య పోరు

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సెమీస్ లో స్వియాటెక్ – మాడిసన్ తలపడనున్నారు

EDUCATION & JOBS UPDATES

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష(సీఎస్‌ఈ) 2025కు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు