Home » TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 26 – 01 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 26 – 01 – 2025

BIKKIS NEWS (జనవరి 26) : TODAY NEWS IN TELUGU on 1st JANUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 26th JANUARY 2025

TELANGANA NEWS

రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్‌ కార్డు పథకాలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

అలకనంద కిడ్నీ రాకెట్‌ దర్యాప్తులో కీలక విషయాలు. 100 కిడ్నీ లు అక్రమంగా మార్పు.

ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత మున్సిపాల్టీలపై ఉన్నదని, ఈ విషయంలో మున్సిపల్‌ అధికారులు సాకులు చెప్పి తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది.

తెలంగాణ హైకోర్టులో న‌లుగురు న్యాయ‌మూర్తుల ప్ర‌మాణ‌స్వీకారం

జనవరిలోనే ఏప్రిల్‌, మే స్థాయి వినియోగం.. భారీగా పెరిగిన విద్యుత్తు డిమాండ్‌

ANDHRA PRADESH NEWS

నేటి రాజకీయాల్లో ఇమడలేకనే వైదొలగుతున్నా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

NATIONAL NEWS

139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్‌, అగ్నిమాపక, పౌర భద్రత రంగాలకు చెందిన 942 మందికి గ్యాలంట్రీ, సర్వీస్‌ పతకాలు ప్రకటించింది. ఇద్దరికి కీర్తి చక్ర.. 14 మందికి శౌర్యచక్ర.

కీర్తి చక్ర అవార్డులు పొందిన వారిలో ద ఆర్టిలరీకి చెందిన నాయక్‌ దిల్వర్‌ ఖాన్‌ (మరణానంతరం), 22 రాష్ట్రీయ రైఫిల్స్‌ పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన మేజర్‌ మంజిత్‌ ఉన్నారు. జమ్ము కశ్మీర్‌లో ధైర్య సాహసాలకు వీరికీ అవార్డు దక్కింది.

భారతీయులుగా మన ఉమ్మడి గుర్తింపునకు బలమైన పునాది వంటిది మన దేశ రాజ్యాంగమని, అది మనందరినీ ఓ కుటుంబంగా కలిపి ఉంచుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

భారత్‌లోని ప్రతి పౌరునికి విదేశాల్లో పర్యటించే స్వేచ్ఛ ఉన్నదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కని ఢిల్లీ కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.

మహిళలకు ఉచితాలు.. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలు : ఎస్బీఐ తాజా నివేదిక

మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. కార్లు దగ్ధం

ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్‌ రాణాను అమెరికా నుంచి భారత్‌కు అప్పగించేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.

INTERNATIONAL NEWS

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌పై ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడ్డాడని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్‌ సెక్రటరీ)గా పీట్‌ హెగ్సెత్‌ ఎన్నికను అమెరికా సెనేట్‌ ధృవీకరించింది

సెల్‌ టవర్లతో సంబంధం లేకుండా నేరుగా ఆకాశం నుంచి అరచేతిలోని సెల్‌ఫోన్‌కు సిగ్నల్‌ కోసం స్టార్ లింక్ ప్రయత్నం.

BUSINESS NEWS

ఫిబ్రవరిలో బ్యాంకులు పని చేసేది సగం రోజులే.

SPORTS NEWS

ఆస్ట్రేలియన్ మహిళల సింగిల్స్ విజేత అమెరికా కు చెందిన మాడిసన్ కీస్. ఫైనల్ లో సబలెంక పై ఘనవిజయం

అర్ష్‌దీప్‌సింగ్‌ ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కైవసం చేసుకున్నాడు

ఐసీసీ టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఎంపికయ్యాడు

తిలక్ వర్మ పోరాటం తో ఇంగ్లండ్ పై రెండో టీట్వంటీ లో టీమిండియా విజయం

EDUCATION & JOBS UPDATES

SSC GD కానిస్టేబుల్ సిటీ ఇంటిమెషన్ స్లిప్ లు విడుదల

నీట్‌-యూజీ పరీక్షల్లో ఐచ్ఛిక ప్రశ్నలను తొలిగించింది. ఇక నుంచి విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు