BIKKIS NEWS (జనవరి 30) : TODAY NEWS IN TELUGU on 30th JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 30th JANUARY 2025
TELANGANA NEWS
సమగ్ర ఇంటింటి సర్వేకు సంబంధించిన తుది నివేదికను ఫిబ్రవరి రెండో తేదీలోగా క్యాబినెట్ సబ్‌కమిటీకి అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
30 లక్షల చదరపు అడుగుల్లో ఉస్మానియా హస్పిటల్ నిర్మాణం – మంత్రి రాజనర్సింహ
ప్రైవేట్ కాలేజీలపై ఇంటర్‌బోర్డు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాలేజీల యాజమాన్య సంఘాలు తిరుగుబాటు చేశాయి. ఇంటర్ పరీక్షలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
3 ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు
గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దతపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
విదేశీయులను ఆకర్షించేలా టూరిజం పాలసీ ఉండాలి.. అధికారులకు సీఎం ఆదేశం
ANDHRA PRADESH NEWS
ఢిల్లీ పరేడ్‌లో ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం
ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 27న పోలింగ్.
NATIONAL NEWS
ఏడేళ్ల కాలానికి విస్తరించిన రూ. 34,300 కోట్ల పెట్టుబడి అంచనాతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లలో నివాసం ఆధారంగా రిజర్వేషన్ల కోటాను సుప్రీంకోర్టు రద్దు చేసింది.
మహా కుంభమేళాకు భక్తుల తాకిడి భారీగా పెరగడంతో బుధవారం ఉదయం తీర్థరాజ్ సంగం తీరంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
జీఎస్ఎల్వీ ఎఫ్-15 ఎన్వీఎస్-02 నావిగేషన్ శాటిలైట్ ప్రయోగం విజయవంతం.
ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి అదుపులోనే ఉంది. : సీఎం యోగి ఆదిత్యనాథ్
మహాకుంభ్‌లో ముగ్గురు శంకరాచార్యుల భేటీ.. సనాతన ధర్మరక్షణకు కీలక తీర్మానాలు
INTERNATIONAL NEWS
చాట్‌జీపీటీని మించేలా చైనా ‘డీప్‌సీక్’ను అందుబాటులోకి తెచ్చింది.
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ఏ విదేశీ ప్రభుత్వ హస్తం ఉన్నట్టు ఆధారాలేవీ లభించలేదని కెనడా ప్రభుత్వం నిర్వహించిన ఓ విచారణ కమిటీ తేల్చింది.
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు దుర్మరణం
BUSINESS NEWS
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి
సెన్సెక్స్ : 76,532.96 (631.55)
నిఫ్టీ : 23,163.10 (206)
24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.910 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.83,750గా నమోదైంది.
SPORTS NEWS
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టెస్టులలో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఐసీసీ టీట్వంటీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి తిలక్ వర్మ.. తొలిసారిగా టాప్-5కి వరుణ్ చక్రవర్తి
EDUCATION & JOBS UPDATES
ఇగ్నో లో నూతనంగా ఎమ్మేసీ కెమిస్ట్రీ.
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 02 – 2025
- INTER HALL TICKETS
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు