BIKKIS NEWS (జనవరి 31) : TODAY NEWS IN TELUGU on 31st JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 31st JANUARY 2025
TELANGANA NEWS
హాల్‌టికెట్ లేకుండా 128 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది.
సెంట్రల్ రివైజ్డ్ పేస్కేల్‌ను అనుసరించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో యూజీసీ వేతన స్కేల్ పొందుతున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 65 ఏండ్లకు పెంచింది.
గోషామహాల్ స్టేడియంలో శుక్రవారం ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబ జాతరకు గురువారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. నిందితుడు కామారెడ్డి వాసిగా గుర్తింపు
ANDHRA PRADESH NEWS
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదని కేంద్ర ఉకు-గనులశాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్‌లో భూమి రిజిస్ట్రేషన్ చార్జీలను సవరిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీచేసింది
ఏపీలో ఈ గవర్నెన్స్ వాట్సాప్ పాలన ప్రారంభం
ద్వారక తిరుమల రావు పదవీ విరమణ.. హరీశ్ గుప్తాకు డీజీపీగా అదనపు బాధ్యతలు
కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు అడుగులు
NATIONAL NEWS
నేడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆరంభం. ఆర్థిక సర్వే ను విడుదల చేయనున్న కేంద్రం.
సొంత కృత్రిమ మేధ(ఏఐ) మాడల్ అభివృద్ధికి భారత్ చేరువలో ఉన్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
తనకు నోటీసులు పంపడం ద్వారా ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
పారిశుద్ధ్య కార్యక్రమాల్లో, మురుగునీటి కాలువలను శుభ్రపరచడంలో మానవులను వినియోగించడంపై సుప్రీంకోర్టు ఈ నెల 29న నిషేధం విధించింది
మహాత్మా గాంధీ వర్ధంతి.. రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
మహాకుంభమేళా.. 18 రోజుల్లో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు
కార్బన ఉద్గారాలతో 1.9 మీటర్లు పెరగనున్న సముద్రమట్టం.. భారత్ సహా పలు దేశాలకు ముప్పు.
INTERNATIONAL NEWS
వాషింగ్టన్‌లో విమానం – ఆర్మీ హెలికాప్టర్ ఢీ.. 67 మంది దుర్మరణం.
అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు.
BUSINESS NEWS
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ : 76,759.81 (226.85)
నిఫ్టీ : 23,249.50 (86 40)
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. నేడు ఆర్థిక సర్వే ప్రకటన.
అమెరికా ఫెడరల్ రిజర్వు ఈసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది.
SPORTS NEWS
ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత జట్టు నేడు జరిగే తొలి సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొననుంది.
నేడు భారత్, ఇంగ్లండ్ నాలుగో టీ20
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరుగబోయే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో వచ్చే నెల 16న ప్రారంభ వేడుకలు జరుగనున్నాయి.
EDUCATION & JOBS UPDATES
నేడు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీషు ప్రాక్టికల్ పరీక్ష
CSIR UGC NET డిసెంబర్ 2024 పరీక్షలు ఫిబ్రవరి 28, మార్చి 1,2 తేదీలలో జరుగును.
నేటి నుండి జేఈఈ మెయిన్ రెండో విడత దరఖాస్తులు
- CURRENT AFFAIRS 2nd FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 02 – 2025
- CURRENT AFFAIRS 1st FEBRUARY 2025
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 02 – 2025
- INTER HALL TICKETS
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు