Home » CURRENT AFFAIRS 17th JANUARY 2025

CURRENT AFFAIRS 17th JANUARY 2025

BIKKI NEWS : CURRENT AFFAIRS 17th JANUARY 2025

CURRENT AFFAIRS 17th JANUARY 2025

1) అనుమానాస్పద ఫ్రాడ్‌ కాల్స్‌పై మొబైల్‌ వినియోగదారులు నేరుగా తమ కాల్‌లాగ్స్‌ నుంచి ఫిర్యాదు చేసేందుకు వీలుగా టెలికం శాఖ(డీఓటీ) ఏ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది.?
జ : సంచార్‌ సాథీ

2) భూ కుంభకోణం కేసులో పాకిస్థాన్‌ ఏ మాజీ ప్రధానమంత్రి 14 ఏండ్ల జైలు శిక్ష, ఆయన సతీమణికి ఏడేండ్ల కారాగార శిక్ష పడింది.?
జ : ఇమ్రాన్‌ ఖాన్‌

3) 2024 చివరి నాటికి దేశ జనాభా ఎంతగా నమోదైంది.?
జ : 1,408 బిలియన్లు (140.08 కోట్లు)

4) బ్యాంక్‌ ఖాతాలతోపాటు ఏ బ్యాంకింగ్ సేవలకు కచ్చితంగా నామినీలు తప్పనిసరి చేయాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంక్‌ తాజాగా ఆదేశించింది.?
జ : డిపాజిట్‌ ఖాతాలు, లాకర్లకు

5) పాకిస్థాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఏ తొలి ఉపగ్రహన్ని తాజాగా ప్రయోగించింది.?
జ : PRSC – EO1

6) మహిళల అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ 2025 ఏ దేశంలో నిర్వహిస్తున్నారు.?
జ : మలేషియా

7) ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 2024, 2025, 2026 లలో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5% & 6.7% & 6.7%

8) ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2024, 2025, 2026 లలో భారత వృద్ధి రేటు ఎంత.?
జ : 6.5%

9) తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ సుజయ్ పాల్

10) వార్షిక వాతావరణ నివేదిక 2024 ప్రకారం ఎంతమంది ప్రకృతి వైపరీత్యాల కారణంగా మృతి చెందారు.?
జ : 2400 మంది

11) భారత వాతావరణ విభాగం 2025 జనవరి 15 నాటికి ఎన్ని వసంతాలు పూర్తి చేసుకుంది.?
జ : 150

12) ఏ దేశం భారత్ లోని మూడు అణు సంస్థలపై ఆంక్షలు ఎత్తివేసింది.?
జ : అమెరికా

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు