Home » డా. రెడ్డిస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్, డిగ్రీ అభ్యర్థులకు మెగా జాబ్ మేళా

డా. రెడ్డిస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్, డిగ్రీ అభ్యర్థులకు మెగా జాబ్ మేళా

BIKKIS NEWS (జనవరి 24) : MEGA JOB MELA IN JAGTUAK ON JANUARY 28th. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్. ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు జనవరి 28వ తేదిన, మంగళవారం రోజున డాక్టర్ రెడ్డిస్ ల్యాబరేటరిస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జగిత్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బి.నారాయణ, రెడ్డి ల్యాబ్స్ హెస్ఆర్ ఐ. అచ్యుత రామరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

MEGA JOB MELA IN JAGTUAK ON JANUARY 28th.

ఈ సందర్భంగా డీఐఈవో మాట్లాడుతూ 2023-2024 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించివారికి, అలాగే డిగ్రీ బిఎస్సి కోర్సులో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా చదివి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించివారికి, తెలుగు భాషపై పట్టు ఉండి, ఇంగ్లీష్ భాషపై ప్రాథమిక అవగాహన కలిగిన విద్యార్థులను ప్రతిభఆధారంగా డా. రెడ్డీస్ లాబోరేటరీస్ వారు ఎంపిక చేసుకొని పై చదువులు చదివిస్తూ, ఉద్యోగ అవకాశం కల్పిస్తుందని, తగిన వేతనం కూడ ఇస్తుందని పేర్కొన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులలో ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు ఎస్.ఎస్.సి., ఇంటర్మీడియట్ మెమోలు,రెండు పాస్ ఫొటోలు, ఆధార్ కార్డు, ఆదాయం సర్టిఫికెట్, డిగ్రీ పూర్తి చేసినవారు ఎస్.ఎస్.సి., ఇంటర్మీడియట్, డిగ్రీ, మెమోలు, రెండు పాస్ ఫొటోలు, ఆధార్ కార్డు, ఆదాయం సర్టిఫికెట్ వంటి ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

వివరాలకు డా. పి. తిరుపతి. ఏం. విజేందర్ రావు, బి. రాజేశం 9963117456, 9440169997, 9177877306 మొబైల్ నెంబర్సు యందు సంప్రదించాలని పేర్కొన్నారు.

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు