Home » RythuBharosa – రైతు భరోసాకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు.?

RythuBharosa – రైతు భరోసాకు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు.?

BIKKIS NEWS (జనవరి 21) : Rythu Bharosa New guidelines 2025. రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.12 వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించింది.

Rythu Bharosa New guidelines 2025

ఈ నేపథ్యంలో రైతు భరోసా కు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు… అలాగే రైతు బంధు కు రైతు భరోసా కు మార్గదర్శకాలలో ఉన్న తేడాలు (RYTHU BHAROSA vs RYTHU BHANDU) కింద ఇవ్వడం జరిగింది.

రైతు భరోసా మార్గదర్శకాలివే..

రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలకు పెంపు.


భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం అందజేత.

వ్యవసాయ యోగ్యం కాని భూములు రైతు భరోసా నుంచి తొలగింపు.


ఆర్ఓఎఫ్ఆర్(రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులు.


ఆర్బీఐ నిర్వహించే డీబీటీ(నేరుగా లబ్ధిదారుకు నగదు బదిలీ) పద్ధతిలో రైతు భరోసా సాయం రైతుల ఖాతాల్లో జమ.

రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకుల తరఫున అమలు.

ఐటీ భాగస్వామిగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ఎంపిక.


ఫిర్యాదుల పరిష్కారం, పథకం అమలుకు జిల్లా కలెక్టర్లకు బాధ్యతలు.

రైతుబంధు నిబంధనలు ఇవి

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు సాయం భూమి ఉన్న అందరికీ అన్నట్లుగా అందించింది.

ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర భేదాలు పెట్టలేదు. దీనివల్ల సాగు చేయని భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫాంహౌస్ యజమానులు, కళాశాలల యాజమాన్యాలకు రైతుబంధు సాయం అందిందనే ఆరోపణలున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్ శివారులో భూముల ధరలు గత రెండు, మూడు దశాబ్దాలుగా ఆకాశాన్నంటాయి.

ఈ నేపథ్యంలో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లు, కళాశాలల నిర్మాణానికి వినియోగించారు.

సాధారణంగా వ్యవసాయ భూములు వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే, నాలా(నాన్ అగ్రికల్చరల్ అసెస్మెంట్ యాక్ట్) కింద మార్చుకోవాలి. ఈ ప్రక్రియ నిర్వహించకపోవడంతో హైదరాబాద్ శివారులలో వేలాది ఎకరాల భూములు వ్యవసాయ భూముల కిందనే రికార్డుల్లో కొనసాగుతున్నాయని రైతు సంఘం నేతలు చెబుతున్నారు.

ప్రస్తుతం అలాంటి సాగులో లేని లేదా సాగు యోగ్యం కాని భూములకు సాయం విషయంలో అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చూస్తే, వ్యవసాయేతర భూములన్నింటికీ రైతుభరోసా సాయం నిలిచిపోనుంది.

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు