BIKKIS NEWS (జనవరి 22) : TODAY NEWS IN TELUGU on 22nd JANUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 22nd JANUARY 2025
TELANGANA NEWS
భూ భారతి చట్టం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి.
ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను మం జూరు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు.
మరో వారం పాటు ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండలు
దావోస్ వేదికగా 15 వేల కోట్లు పెట్టుడులు పెట్టడానికి మెఘా సంస్థ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది.
ANDHRA PRADESH NEWS
గ్రూప్-1 మెయిన్స్ తేదీలు ఖరారు.. వెల్లడించిన ఏపీపీఎస్సీ
ఏపీ పెట్టుబడుల నేస్తం – దావోస్ లో బాబు
ఎపీఎస్ ఆర్టీసి కి సంక్రాంతి సీజన్ లో 21.11 కోట్ల లాభం
జనసేన కు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు.
NATIONAL NEWS
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు.
జమిలీ ఎన్నికలపై ఈ నెల 31న జేపీసీ రెండో సమావేశం..
సూపర్‌సానిక్ కంబషన్ రాంజెట్(స్క్రాంజెట్) ఇంజిన్ గ్రౌండ్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసినట్టు మంగళవారం రక్షణ శాఖ ప్రకటించింది.
మహా కుంభమేళాలో ఫిబ్రవరి 05న పాల్గొననున్న ప్రధాని మోదీ
దేశంలో నక్సలిజం కొనఊపిరితో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు
INTERNATIONAL NEWS
పారిస్ ట్రీటీ, డబ్ల్యూహెచ్‌వో నుంచి అమెరికా వైదొలిగింది.
అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు’ అని ట్రంప్ ప్రకటించారు.
తుర్కియేలోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ వద్ద గల 12 అంతస్తుల హోటల్‌లో మంగళవారం మంటలు చెలరేగి 66 మంది పర్యాటకులు మరణించారు.
BUSINESS NEWS
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 75,838.36 (-1,235)
నిఫ్టీ : 23,045.30 (-299.45)
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన సంస్థల జాబితాలో ఐదు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రాలు ఉన్నాయని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది
ప్రపంచంలో గత ఏడాది సగటున వారానికి నలుగురు బిలియనీర్లు అవతరించారని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక తెలియజేసింది మరి.
SPORTS NEWS
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అల్కరాజ్ పై సంచలన విజయం సాదించి సెమీస్ కు చేరిన జకోవిచ్
ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో భారత్ మలేషియా పై 10 వికెట్ల తేడాతో గెలుపు
నేడు భారత్-ఇంగ్లాండ్ మద్య తొలి టీ20 మ్యాచ్
EDUCATION & JOBS UPDATES
జేఈఈ మెయిన్-1 పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
గ్రూప్-1 మెయిన్స్ తేదీలు ఖరారు.. వెల్లడించిన ఏపీపీఎస్సీ
SSC MTS TIER 1 RESULTS విడుదల
CMAT ADDMIT CARDS విడుదల
SSC CGLE TIER 2 పరీక్ష ప్రాథమిక కీ విడుదల
- ICMR – NIN HEALTH TIPS – ఆరోగ్యానికి,.ఆయుష్షుకు 25 సూత్రాలు
- HOME LOAN : వివిధ బ్యాంకుల గృహ రుణాలఫై వడ్డీ రేట్లు
- CURRENT AFFAIRS 24th FEBRUARY 2025 – కరెంట్ అఫైర్స్
- CBSE EXAMS – సీబిఎస్ఈ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు
- GK BITS IN TELUGU – 2, జీకే బిట్స్ – 2
FOLLOW US @ TELEGRAM & WHATSAPP
తాజా వార్తలు