Home » TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 28 – 01 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 28 – 01 – 2025

BIKKIS NEWS (జనవరి 28) : TODAY NEWS IN TELUGU on 28th JANUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 28th JANUARY 2025

TELANGANA NEWS

ఫిబ్ర‌వ‌రి 9 నుంచి ఆర్టీసీ స‌మ్మె.. ఎండీ స‌జ్జ‌నార్‌కు నోటీసులు.

వైస్‌ చాన్సెలర్ల నియామకంలో యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు

ANDHRA PRADESH NEWS

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని చంద్రబాబు తెలిపారు.

గ్రామ సచివాలయాలను కేటగిరులుగా విభజించి , ప్రస్తుతమున్న ఉద్యోగులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

లోకేశ్‌ రెడ్‌బుక్‌కు మా ఇంట్లో కుక్క కూడా భయపడదు.. అంబటి రాంబాబు సెటైర్లు

తొలి విడతలో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామం చొప్పున రైతుభరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లో జమచేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

సినిమా థియేటర్లకు ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది.

జీవో 46 కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ నోటిసులు

NATIONAL NEWS

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

హిమాచల్‌ప్రదేశ్‌ కు చెందిన ఈ లాకప్‌ డెత్‌ కేసులో ఐజీ సహా 8 మంది పోలీసులకు జీవితఖైదు.

వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. 14 సవరణలకు కమిటీ ఆమోదం

మహాకుంభమేళా.. 14 కోట్ల మంది పుణ్యస్నానాలు

అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి.. యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌

దేశంలో జంతువుల కాట్ల వల్ల ఏటా సగటున 5726 మంది మరణిస్తున్నారు. ఇందులో 76.8 శాతం కుక్క కాట్లేనని తేలింది. ది లాన్సెట్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ జర్నల్‌ అధ్యయన వివరాలను ప్రచురించింది.

దేశమంతా ఒకే సమయం ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గంగా నదిలో మునిగితే పేదరికం అంతమవుతుందా, ఆకలి కడుపులు నిండుతాయా అని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

INTERNATIONAL NEWS

ట్రంప్‌ దెబ్బకు దిగొచ్చిన కొలంబియా.. అమెరికా నిబంధనలకు ఓకే చెప్పింది.

అమెరికాలోని కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని సమాచారం.

అమెరికాలోని కొలరాడోలో జరుగుతున్న 2025 ‘అంతర్జాతీయ మంచు శిల్ప కళా చాంపియన్‌షిప్‌’ పోటీల్లో మైండ్‌ ఇన్‌ మెడిటేషన్‌’ థీమ్‌తో భారత కళాకారుల బృందం చెక్కిన మంచు శిల్పాలకు కాంస్య పతకం.

BUSINESS NEWS

నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 75,366.17 (- 824.29)
నిఫ్టీ : 22,829.15 (- 263.05)

అమెజాన్‌ గిఫ్ట్‌ కార్డులపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఆర్బీఐకి స్పెషల్‌ రిక్వెస్ట్‌

SPORTS NEWS

ఐసీసీ టెస్టు క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డును భార‌త బౌలర్ బుమ్రా గెలుచుకున్నాడు.

స్మృతి మందానాకు ఐసీసీ వ‌న్డే మ‌హిళా క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు

ఆఫ్ఘ‌న్ ఆల్‌రౌండ‌ర్ అజ్మ‌తుల్లాకు.. ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ద‌క్కింది

నేడు రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌.

నేటి నుండి ఉత్తరాఖండ్ వేదికగా 38వ నేషనల్ గేమ్స్ ప్రారంభం.

ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌) 2024-25 సీజన్‌ ట్రోఫీని హోబర్ట్‌ హరికేన్స్‌ సొంతం చేసుకుంది.

EDUCATION & JOBS UPDATES

ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 1154 యాక్ట్ అప్రెంటీస్ ఖాళీలు

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ దూరవిద్య ద్వారా పీజీ – డిప్లొమా, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు