Home » CURRENT AFFAIRS 25th JANUARY 2025

CURRENT AFFAIRS 25th JANUARY 2025

BIKKIS NEWS :CURRENT AFFAIRS 25th JANUARY 2025

CURRENT AFFAIRS 25th JANUARY 2025

1) కేంద్రం ఎంతమందికి పద్మ అవార్డులు ప్రకటించింది.?
జ : 139 మందికి

2) గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఎంతమందికి కీర్తి చక్ర, శౌర్య చక్ర పతకాలు ప్రకటించింది.?
జ : ఇద్దరికి కీర్తి చక్ర.. 14 మందికి శౌర్యచక్ర.

3) కీర్తి చక్ర అవార్డులు పొందిన వారు ఎవరు .?
జ : ద ఆర్టిలరీకి చెందిన నాయక్‌ దిల్వర్‌ ఖాన్‌ (మరణానంతరం), 22 రాష్ట్రీయ రైఫిల్స్‌ పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన మేజర్‌ మంజిత్‌ ఉన్నారు.

4) భారత్‌లోని ప్రతి పౌరునికి విదేశాల్లో పర్యటించే స్వేచ్ఛ ఉన్నదని, అది రాజ్యాంగం కల్పించిన హక్కని ఏ హై కోర్టు తీర్పు చెప్పింది.?
జ : ఢిల్లీ హైకోర్టు

5) ముంబై ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన ఎవరిని భారత్‌కు అప్పగించేందుకు అమెరికా ఒప్పుకుంది.?
జ : తహవూర్‌ రాణాను

6) అమెరికా రక్షణ మంత్రి(డిఫెన్స్‌ సెక్రటరీ)గా ఎవరి ఎన్నికను అమెరికా సెనేట్‌ ధృవీకరించింది.?
జ : పీట్‌ హెగ్సెత్‌

7) ఆస్ట్రేలియన్ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : అమెరికా కు చెందిన మాడిసన్ కీస్. (ఫైనల్ లో సబలెంక పై ఘనవిజయం)

8) ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును ఎవరు కైవసం చేసుకున్నారు.?
జ : అర్ష్‌దీప్‌సింగ్‌

9) ఐసీసీ టీ20 టీమ్‌కు కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : రోహిత్ శర్మ

10) గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ 2025 ను ఎవరు అందుకున్నారు.?
జ : ఊర్వశి సిన్హా

11) బ్రిక్స్ పార్టనర్ కంట్రీ గా ఏ దేశం జాయిన్ అయింది.?
జ : నైజీరియా

12) ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు.?
జ : హెచ్. పాటెన్ & హెచ్. హెలియోవారా

13) ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేత ఎవరు.?
జ : జే. పీర్స్ & ఓ. గడేక్కి

FOLLOW US @ TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు